CM KCR Public Meeting | హైదరాబాద్, ఆగస్టు 20 ( నమస్తే తెలంగాణ ) : ధరణివల్లనే రాష్ట్రంలో రైతులకు కష్టాలు తీరాయని సీఎం కేసీఆర్ చెప్పారు. పైరవీకారుల రాజ్యం పోవటంతో నిమిషాల మీద రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు అవుతున్నాయని చెప్పా రు. సూర్యాపేటలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ‘వీఆర్వోలతో నాకేమైనా పాలిపగనా? ఎందు కు తీసేసిన? ఎల్లయ్య భూమి మల్లయ్యకు, మల్లయ్య భూమి ఎల్లయ్యకు ఉల్టా రాసుడు, గట్ల ఎట్లయింది అడిగితే.. అయిందేదో అయిం ది కానీ, వట్టిగనే అయితదా బావ అని అను డు. ఏవిధంగా రాక్షసుల్లాగా రాచిరంపాన పెట్టి చంపిన్రు? ఒకనాడు నల్లగొండ జిల్లాలో 15 రిజిస్ట్రేషన్ ఆఫీసులుండె. ఇవాళ 87 రిజిస్ట్ట్రేషన్ ఆఫీసులు ఉన్నయ్. కడుపుల చల్ల కదలకుం డా రిజిస్ట్రేషన్ అంటే సూర్యాపేటకు రావాల్సిన అవసరం లేదు. పెన్‌పహాడ్ వాళ్లకు పెన్పహాడ్లోనే, తిరుమలగిరి వాళ్లకు తిరుమలగిరిలోనే 15 నిమిషాల్లో అయిపోతది. 5 నిమిషాల్లో మ్యుటేషన్.. వెంటనే సైట్ మీద వచ్చేస్తది.
మీ కియ్యాల రైతుబంధు పంపిస్తున్న. దురదృష్టం కొద్దీ ఎవరైనా రైతు చనిపోతే వారి కుటుంబం వీధిల పడొద్దని, పిల్లలు చిన్నోళ్లు ఉంటే ఇబ్బం ది పడొద్దని రూ.5 లక్షల రైతు బీమా పంపిస్తున్న. ఆ ప్రిమీయం మొత్తం సర్కారే కట్టి పంపిస్తున్నది. మరి ఆ పైసలు ఎట్ల పంపిస్తున్నది? ధరణి వల్ల అక్కడ పైసలు బ్యాంకులో రిలీజ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ సెల్ఫోన్లు టింగు టింగుమని మోగుతయ్. ఏంటిది అంటే రైతుబంధు పైసలు పడ్డయ్. దరఖాస్తు లేదు. దఫ్తర్ లేదు, పహానీ నకల్ లేదు, అకౌంట్లు ఉన్నయ్ కాబట్టి పైసలు పడుతున్నది. వడ్లు అమ్మిన పైసలు కూడా సీదా బ్యాంకు అకౌంట్ల పడుతయ్. అం తకుముందు బీట్ల కాడికి, సేట్ల కాడికి, గిర్నీల కాడికి నెలలతరబడి తిరిగి పరిస్థితులు ఉండె. ఇయ్యాల అట్ల ఉన్నదా? అలాంటి ధరణిని తీసేస్తామంటరు కాంగ్రెసోళ్లు. మళ్ల పాత పద్ధతి పెడుతరా? ధరణి తీసేస్తే రైతుబీమా ఎట్ల రా వాలె? మళ్లా గీకాల్నా రైతులను? పంట ఏసినవని నమ్మకమేంది అంటరు? మళ్ల సర్టిఫైడ్ చేయాలె. రిజిస్ట్రేషన్లు ఇప్పుడెట్ల అయితున్నయ్. ఎనకటెట్ల అయితుండె. అందుకే ఓట్లు వస్తే ఆగమాగం కావద్దు. స్థిరంగా ఆలోచించాలె. ఓటనేది మన రాతను మనం రాసుకునే గొప్ప ఆయుధం’ అని చెప్పారు.

భూమిపై సర్వహక్కులు రైతులవే
ధరణి వల్ల రైతు భూమిపై ఆ రైతుకే సర్వాధికారాలు వచ్చాయని సీఎం తెలిపారు. ‘ఎన్నడన్న ఎవడన్నా ఊహించిండా? ధరణి ఏంది అసలు.. ఇంతకుముందు వీఆర్వో, గిరిధావర్, తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, సెక్రటరీ, సీసీఎల్ఏ, ఆపైన రెవెన్యూ మంత్రి వరకు పెత్తనం ఉండేది. ఇందులో ఎవరొకరు కిందమీద చేసినా పెద్దపాము మింగినట్టే.
మళ్లా కిందిదాన్క వస్తది. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నదా? ఒకసారి ధరణిలో భూమి ఎక్కిందంటే మార్చే మొనగాడు ఎవడన్నా ఉన్నడా? ధరణి అర్థం ఏమంటే ఈ భర్తలను, పెత్తనాలను తీసేసి రైతుల భూమి మీద రైతులకే ఇచ్చింది. రైతుల భూమి పేరు మార్చాలంటే సీఎం కాదు ఎవరికీ లేదు. ఒక్క రైతు బొటనవేలికే ఆ పవర్ ఉన్నది. ప్రభుత్వం తన దగ్గర ఉన్న పవర్‌ను రైతుకు ఇచ్చింది. అమ్ముకుంటవా? గిఫ్ట్ ఇస్తవా? అది నీ ఇష్టం. మీకున్న అధికారాన్ని ఉంచుకుంటరా? పోగొట్టుకుంటరా? పైరవీకారుల మందల పాలైతరా? ఆలోచించుకోవాలె. కాంగ్రెస్ వస్తే మళ్ల పైరవీకారులు వస్తరు. రిజిస్ట్రేషన్‌కు పోవాల్నంటే సద్దులు కట్టుకుని పోవాలె’ అని పేర్కొన్నారు.