ధరణి పోర్టల్ కమిటీ ప్రత్యేక భేటీ
ధరణి పోర్టల్ పునర్నిర్మాణ నిపుణుల కమిటీ సర్వే అండ్ సెటిల్మెంట్శాఖ, వక్ఫ్‌బోర్డు, దేవాదాయశాఖ అధికారులతో సచివాలయంలో శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఆయాశాఖల రికార్డులు, సమస్యలు తదితర అంశాలపై చర్చించింది. మూడు శాఖల సమస్యలను అడిగి తెలుసుకున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ పునర్నిర్మాణ నిపుణుల కమిటీ సర్వే అండ్ సెటిల్మెంట్శాఖ, వక్ఫ్‌బోర్డు, దేవాదాయశాఖ అధికారులతో సచివాలయంలో శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఆయాశాఖల రికార్డులు, సమస్యలు తదితర అంశాలపై చర్చించింది. మూడు శాఖల సమస్యలను అడిగి తెలుసుకున్నది.
ప్రస్తుతం సర్వే అండ్ సెటిల్మెంట్శాఖ నిర్వహిస్తున్న సర్వే రికార్డుల జాబితాతోపాటు వక్ఫ్‌బోర్డుకు సంబంధించి వక్ఫ్ బోర్డు కింద మొత్తం ఎంత భూమి ఉన్నది? కబ్జాలకు ఎంత గురైంది? వక్ఫ్ భూములను రిజిస్ట్రేషన్, రెవెన్యూశాఖ ఎలా రక్షిస్తున్నాయి? ధరణి పోర్టల్‌లో వక్ఫ్ భూముల సమస్య వం టి అంశాలను ప్రస్తావించారు. దేవాదాయశాఖపై దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న భూమి ఎంత? రక్షణకు తీసుకుంటున్న రిజిస్ట్రేషన్, రెవెన్యూశాఖ తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ధరణి పోర్టల్‌లో దేవాదాయ భూములు సమస్య ఏమిటి? అనే అంశాలపై చర్చించారు. సమావేశంలో సీసీఎల్ఏ నవీన్‌మిట్టల్, ధరణి పునర్నిర్మాణ కమిటీ సభ్యులు కోదండరెడ్డి, రేమండ్ పీటర్, సునీల్‌కుమార్, మధుసూదన్, సీఎమ్మాఆర్వో లచ్చిరెడ్డి, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

