యాదాద్రి,భువనగిరి : యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలను (Dhanurmasa celebrations) వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వివరించారు.
ప్రతిరోజు ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచి, ఉదయం 4 గంటల వరకు సుప్రభాతం, ఉదయం 4 నుంచి 5 వరకు తిరువారాధన, బాలభోగం,ఆరగింపు, ఉదయం 5.45 వరకు తిరుప్పావై సేవాకాలం, తీర్థ ప్రసాదాల గోష్టిని నిర్వహిస్తామన్నారు.
ఉదయం 5.45 నుంచి ఉదయం 6.45 నిమిషాల వరకు స్వామివారికి నిజాభిషేకం, ఉదయం 7.15 నిమిషాల వరకు సహస్రనామార్చన, ఉదయం 7.15 నిమిషాల నుంచి సర్వదర్శనాలు ఉంటాయని వివరించారు. ఉత్సవాల్లో భాగంగా రేపు(శుక్రవారం) రాత్రి 7 గంటలకు గోదా కల్యాణం, 14న ఉదయం 11.30 నిమిషాలకు ఓడి బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.