హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతి ద్వారా డీజీపీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభు త్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ డీజీలుగా కొనసాగుతున్న 1991 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన రాజీవ్త్రన్, సీవీ ఆనంద్, 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన డాక్టర్ జితేందర్‌కు డీజీపీ హోదా ఇచ్చారు. ఇక నుంచి వీరికి ఐపీఎస్ పే రూల్స్-2016 ప్రకారం వేతనాలు అందనున్నాయి.