హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): పోలీసుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్టు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఫిట్నెస్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
పోలీసులు, ఇతర సిబ్బంది కోసం ఫిట్సెస్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.