శిక్షల శాతం పెంచాలి
ప్రతి నేరం నిరూపితమయ్యేలా, నేరస్థులకు శిక్షల శాతం పెంచేలా పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేయాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ఆదేశించారు.
- హెచ్ఆర్ఎంఎస్ అన్ని మాడ్యూల్స్‌లో అమలు చేయాలి
- క్రైం రివ్యూ మీటింగ్‌లో డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రతి నేరం నిరూపితమయ్యేలా, నేరస్థులకు శిక్షల శాతం పెంచేలా పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేయాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ప్రతి నెలా క్రైం రివ్యూలో భాగంగా శుక్రవారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ అన్ని పోలీస్ కమిషనరేట్ల సీపీలు, జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కేసుల నమోదు, దర్యాప్తులో మరింత నాణ్యత పెరగాలని సూచించారు. హెచ్ఆర్ఎంఎస్ (హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం)ను అన్ని మాడ్యూల్స్‌లో అమలు చేయాలని, సర్వీస్ బుక్‌ను వందశాతం డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, పొక్సో, మహిళలకు సంబంధించిన కేసుల్లో శిక్షల శాతం మరింత పెరిగేలా కృషి చేయాలని సూచించారు. సమీక్షలో సీఐడీ డీజీ గోవింద్‌సింగ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిందితులకు జీవితఖైదుహర్షణీయం: స్వాతిలక్రా
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని అనాథాశ్రమంలో 14 ఏండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితులకు జీవితఖైదు విధిస్తూ సంగారెడ్డి పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పు తగిన గుణపాఠమని మహిళా భద్రత విభాగం ఇన్చార్జి, అదనపు డీజీ స్వాతిలక్రా అన్నారు. కేసు నిరూపణలో విశేష కృషి చేసిన సంగారెడ్డి ఎస్పీ, అమీన్పూర్ పోలీస్ బృందం, హైదరాబాద్ భరోసా కేంద్రం, మహిళా భద్రత విభాగం అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

