హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : ఆపదలో రక్తం అవసరమైన వారికి వెంటనే దాతలను అందుబాటులోకి తెచ్చే ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ అప్లికేషన్‌ను డీజీపీ బీ శివధర్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. రక్తదాతలు, పేషెంట్లకు మధ్య వేగంగా సమాచారం అందేలా నిర్వాహకులు ఈ వెబ్ యాప్‌ను రూపొందించారని, రక్తం అవసరమైన సమయంలో వెంటనే దాతను గుర్తించే సదుపాయం ఈ యాప్‌లో ఉంటుందని డీజీపీ చెప్పారు. రక్తదాతల వివరాలు గోప్యంగా ఉండేలా ఆధునిక సాంకేతికతతో ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్టు కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చింతల సంపత్ తెలిపారు. వివరాల కోసం ‘www.callforbloo dfoundation.com’ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు ‘మన మిత్ర’ పేరుతో ఆన్లైన్ సేవలను ఏపీ దేవాదాయ శాఖ అధికారికంగా ప్రారంభించింది. ఈ మేరకు ఆన్లైన్ ద్వారా దర్శన టికెట్లు, పూజలు, ప్రసాదం, వసతి గదుల బుకింగ్ వంటి అనేక సేవలు పొందే వీలు కల్పించినట్టు ఆలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. భక్తులు వివరాల కోసం www.aptemples.ap.go v.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరా రు. శీఘ్రదర్శనంతోపాటు ప్రత్యేక దర్శనం టికెట్లు పొందవచ్చని తెలిపారు. క్యూఆర్ కోడ్, కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపుల సౌకర్యం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు.