హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): సిటిజన్ ఫీడ్ బ్యాక్ సెంటర్ నుంచి వచ్చిన పౌరుల అభిప్రాయాల ఆధారంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బుధవారం డీజీపీ డాక్టర్ జితేందర్ ప్రశంసాపత్రాలను అందించారు. 2,116 మంది పౌరుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా టాప్ 10 పోలీస్స్టేషన్లు, ఎస్‌హెచ్‌వోలు, టాప్ 5 రిసెప్షన్ ఆఫీసర్లు, టాప్ 5 ఎంక్వైరీ ఆఫీసర్లను సత్కరించారు.
క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ ఆధారిత ఫీడ్ బ్యాక్ సిస్టమ్ సహా కొత్త సాంకేతికను త్వరలో ప్రవేశపెడతామని చెప్పారు. ఈ వ్యవస్థలు పిటిషనర్లు, బాధితులు సులభంగా అభిప్రాయాన్ని అందించడానికి సహాయపడతాయని తెలిపారు. సమావేశంలో అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) మహేశ్ ఎం భగవత్ తదితరులు పాల్గొన్నారు.