హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీ శివధర్‌రెడ్డి గురువారం పెట్లబుర్జులోని పోలీసు రవాణా సంస్థ(పీటీవో)ను సందర్శించారు. నూతనంగా ఏర్పాటు చేసిన యోగా కేం ద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సంస్థలోని వివిధ విభాగాలను తనిఖీ చేసి, వాహనాల నిర్వహణ, సాంకేతిక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇబ్రహీంపట్నంలోని ఆక్టోపస్ కార్యాలయాన్ని డీజీపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆక్టోపస్ నూతన పరిపాలన భవనాన్ని, అత్యాధునిక ఆయుధాల ప్రదర్శనను డీజీపీ తిలకించారు. శాట్ కాంబ్యాట్ విభాగాన్ని, బాంబు నిర్వీర్య కేంద్రం పనితీరును పర్యవేక్షించారు. అనంతరం రాష్ట్ర ఎలైట్ కమెండో ఫోర్స్ కార్యకలాపాలు, పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు.