ములుగు, జూలై 3 (నమస్తేతెలంగాణ): ములుగులోని అటవీ శాఖలో బంగ్లా వాచర్‌గా పనిచేస్తున్న గట్టికొప్పుల భాగ్యలక్ష్మిని డీఎఫ్‌వో తన ఇంట్లో సరిగా పనిచేయడం లేదని సస్పెండ్ చేసిన ఘటన ఆ శాఖలో తీవ్ర కలకలం రేపింది. ‘ఇంట్లో పనిచేస్తలేదని సస్పెన్షన్ వేటు’ అనే శీర్షిక బుధవారం‘ నమస్తేతెలంగాణ’లో ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స్పష్టించింది. బుధవారం బంగ్లా వాచర్‌ను కిందిస్థాయి అధికారులు ములుగులోని ఫారెస్టు కార్యాలయానికి పిలిపించి రాజీ కుదుర్చేందుకు యత్నించినట్టు తె లిసింది. ‘నీ సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే పోస్టిం గ్ ఇస్తాం. పెద్ద సారుకు చెడ్డపేరు రాకుండా ఉండేందుకు.. ఆయన తప్పేమీ లేదు. నేనే కావాలని సార్ మీద తప్పుడు మాటలు చెప్పి న’ అని మీడియా ముందు ఒప్పుకోవాలని బెదిరించినట్టు తెలుస్తున్నది. తనకు జరిగిన అన్యాయం జరిగినప్పుడు ఏ అధికారి అండ గా నిలవలేదని, తన ఆవేదనను కార్యాలయానికి వచ్చిన మీడియాకు వివరించానని, నిజా న్ని నిర్భయంగా చెప్పుతానని, అసత్యపు మా టలు తాను మీడియాకు చెప్పే ప్రసక్తే లేదని, పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారో ఇవ్వండి అని వెనక్కి తగ్గేది లేదని బాధితురాలు తెగేసి చెప్పినట్టు సమాచారం.
న్యాయం చేస్తాం: డీఎఫ్‌వో
భాగ్యలక్ష్మి సస్పెండ్ విషయంలో సముచిత న్యాయం చేస్తామని జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్‌జాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె ఆరోపించినట్టు తాను ఎలాంటి సొంత పనులు చేయించుకోలేదని పేర్కొన్నారు. మీడియా ముందు ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం తగదని ఆయన సూచించారు.
ఏ సొసైటీకి అలాటయ్యారో ప్రకటించని ట్రిబ్
హైదరాబాద్, జూలై3 (నమస్తే తెలంగాణ): మొన్నటివరకు ఫలితాలను ప్రకటించకుండా మానసిక ఆవేదనకు గురి చేసిన తె లంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్), ఇ ప్పుడు సరైన సమాచారమివ్వకుండా ది వ్యాంగ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నది. డీఎల్, జేఎల్, టీజీటీ పోస్టులకు ఇటీవల మెరిట్ జాబితాలను వెల్లడించింది. అ యితే ఆయా అభ్యర్థులు ఏ సొసైటీలకు అ లాటయ్యారనే జాబితాను మాత్రం వెబ్సైట్ లో పొందుపరచలేదు. బీసీ, ట్రైబల్, మైనార్టీ సొసైటీలు ఇప్పటికే ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మెసేజ్‌లను పంపడంతోపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను కూడా నిర్వహించాయి. సోషల్ వెల్ఫేర్ సొసైటీ సైతం అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు షెడ్యూల్ ప్రకటించింది. అయితే 1:1 మెరిట్ జాబితాలో ఉన్నా కూడా పలువురికి ఇప్పటివరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదు. తాము ఏ సొసైటీకి ఎంపికయ్యామో? అనే విషయం కూడా తెలియకుండా పోయిందని దివ్యాంగ అభ్యర్థులు వాపోతున్నారు.