తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్ రావు గారి మరణం పట్ల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు తన సంతాపాన్ని ప్రకటించారు. ప్రభాకర్ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన మంత్రి కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
వినోద్ కుమార్ సంతాపం…
తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్ రావు మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
జూలూరు గౌరీశంకర్ సంతాపం…
తెలంగాణ బాషా సాంస్కృతిక వికాసంలో చైతన్యవంతమైన భూమికను పోషించిన దేవులపల్లి ప్రభాకర్ రావు మృతి తీరని లోటు వారి స్ఫూర్తి ని ముందుకు తీసుకెళ్లడమే మనం ఇచ్చే గొప్ప నివాళి.. అంటూ తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు అన్నారు.
మంత్రి జగదీశ్ రెడ్డి సంతాపం…
తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్ రావు గారి మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.