
యాదాద్రి కొండపై ఆటోస్టాండ్ వద్ద భక్తిభావం ఉట్టిపడేలా స్వాగత తోరణాన్ని నిర్మిస్తున్నారు. రెండు ఘాట్ రోడ్లు కలిసే ప్రాంతంలో ఈ తోరణం భక్తులకు స్వాగతం పలుకనున్నది. 40 ఫీట్ల ఎత్తు, 20 ఫీట్ల వెడల్పుతో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆర్చ్పై దేవతామూర్తులను పొందుపరిచేందుకు చక్కటి సాలహారాలు రూపొందించనున్నారు. పిల్లర్లపై సింహాకృతులు, ఐరావతాలు, గోపురాలు ఉండనున్నాయి. ఆర్చ్పై కలశాకృతులు, శంఖు చక్ర, తిరునామాలు, అద్భుతమైన కిటికీలు, కాకతీయ తోరణాలు, దేవతామూర్తులను పొందుపరిచేలా నిర్మాణాలు సాగనున్నాయి. సాలహారలో స్వామి, అమ్మవార్ల ప్రతిమలను అమర్చనున్నారు. అధికారులు విడుదల చేసిన నమూనా చిత్రం ఆకట్టుకుంటుంది. -యాదాద్రి