హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. ఆదివారం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయు డు, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్, తెలంగాణ రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు ప్రత్యేక పూజలు చేసి, స్వామి వారి ఆశీర్వాదం పొందారు.
వీరికి పూజారులు తీర్థప్రసాదాలు అందించారు. శనివారం స్వామివారి హుండీ ఆదాయం రూ.4.34 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.