Karthika Pournami | కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వరం, సిద్దేశ్వరాలయం, కోటగుల్ల, పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భద్రాచలం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించారు.