మహదేవపూర్(కాళేశ్వరం), మే 16 : సరస్వతీ పుషరాల్లో అధికారుల తీరుపై భక్తులు, సాధువులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఆదాయం కోసమే చూస్తున్నారని, సామాన్య భక్తుల ఇబ్బందులను పట్టించుకోలేదని మండిపడుతున్నారు. సాధువులైన తమ వద్ద దర్శనం కోసం వంద రూపాయలు వసూలు చేయడం దారుణమని అన్నారు.
పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ.35 కోట్లు వెచ్చించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నా ఇకడ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. సాధారణ భక్తుల వద్ద కాళేశ్వరంలో గ్రామ పంచాయతీ పేరిట ప్రతి వాహనానికి రూ.100 వసూలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.