యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి సర్వదర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతోంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. భక్తుల సౌకర్యార్థం దృష్ట్యా కొండపైకి ఉచిత బస్సుల రాకపోకలకు ఏర్పాట్లు చేశారు.