కేసీఆర్ మరోసారి సీఎం కావాలి
‘యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామీ.. కేసీఆర్ మరోసారి సీఎం అయ్యేలా దీవించు తండ్రీ.. ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో సకల జనులు సంతోషంగా ఉంటారు’ అని కొమ్మాకుల నాగరాజు స్వామివారిని వేడుకున్నారు.
- మోకాళ్లపై కొండపైకి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు
- హనుమకొండ నుంచి యాదగిరిగుట్టకు పాదయాత్ర చేసిన నాగరాజు
యాదాద్రిభువనగిరి, నవంబర్17 (నమస్తే తెలంగాణ) : ‘యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామీ.. కేసీఆర్ మరోసారి సీఎం అయ్యేలా దీవించు తండ్రీ.. ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో సకల జనులు సంతోషంగా ఉంటారు’ అని కొమ్మాకుల నాగరాజు స్వామివారిని వేడుకున్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తికి చెందిన కొమ్మాకుల నాగరాజు గత శుక్రవారం భద్రకాళి అమ్మవారి దేవాలయం నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వద్దకు చేపట్టిన పాదయాత్ర మంగళవారం యాదగిరిగుట్టకు చేరుకున్నది.
ఈ సందర్భంగా స్వామివారి వైకుంఠ ద్వారంవద్ద కొబ్బరికాయను సమర్పించుకుని మెట్లమార్గం ద్వారా మోకాళ్లపై కొండపైకి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే రైతులు సుభిక్షంగా ఉన్నారని, ఇప్పుడా పరిస్థితి లేదని వాపోయారు. కేసీఆర్ రాష్ర్టానికి పాలకుడిగా ఉంటేనే సబ్బండ వర్గాలు సంతోషంగా ఉంటారని చెప్పారు. అనంతరం యాదగిరిగుట్ట నుంచి తుర్కపల్లి మీదుగా ఎర్రవల్లికి పాదయాత్రగా బయలుదేరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

