దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం అమ్మవారిని ప్రత్యేక రూపంలో అలంకరించారు. శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబిక అమ్మవారు, అలంపూర్‌లోని జోగులాంబ, బాసరలోని సరస్వతీ మాత, వేములవాడలోని రాజన్న ఆలయంలో అమ్మవారు కూష్మాండ దేవిగా దర్శనమిచ్చారు. భద్రాచలంలోని శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారిని ధాన్యలక్ష్మిగా అలంకరించి పూజలు నిర్వహించారు.