రఘునాథపాలెం, అక్టోబర్ 23: రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ కులాల ఆర్థికాభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. కులవృత్తులు, సంచార జాతుల బాగోగులపై ఏ సీఎం చేయని పనులు కేసీఆర్ చేశారని చెప్పారు.
11 కులాలకు బీసీ ఫెడరేషన్లు, 100 శాతం సబ్సిడీ రుణాలు, రూ.50 వేలు చొప్పున 36 వేల మందికి ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. సమావేశంలో షేక్ సకీనా, నాయకులు జక్కుల లక్ష్మయ్య, తమ్మారపు బ్రహ్మం, తంగెళ్లపల్లి శ్రీనివాసరావు, తెనాలి వీరబాబు, కొత్తపల్లి పుష్ప, రేగళ్ల సీతరాములు, నర్సింహా, రచ్చ రామారావు పాల్గొన్నారు.