కొత్తూరు రూరల్, మే 11: 50 ఎకరాల్లో 50 కోట్లతో హజ్రత్ సయ్యద్ జహంగీర్‌పీర్ దర్గాను అభివృద్ధి చేస్తున్నట్టు హోంమంత్రి మహ్మద్ మహమూద్‌అలీ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వలోని జహంగీర్‌పీర్ దర్గాలో నిర్వహించిన న్యాజ్(కందూరు)కు వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎండీ మసిఉల్లాఖాన్, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్‌తో కలిసి హోంమంత్రి హజరయ్యారు.దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 50 ఎకరాల స్థలం, రూ.50 కోట్లను మంజూరు చేశారని హోంమంత్రి తెలిపారు.