e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News రేపటిలోగా ఖాళీ పోస్టుల వివరాలను అందించాలి : మంత్రి ఎర్రబెల్లి

రేపటిలోగా ఖాళీ పోస్టుల వివరాలను అందించాలి : మంత్రి ఎర్రబెల్లి

రేపటిలోగా ఖాళీ పోస్టుల వివరాలను అందించాలి : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అనుబంధ శాఖ సంస్థలలోని పోస్టుల వివరాలను రేపటిలోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయ మినీ కాన్ఫరెన్స్ హల్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ,సెర్ఫ్, శ్రీనిధి, తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఈజీఎంఎం, స్వామి రామానంద తీర్ధ ఇనిస్టిట్యూట్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై అధికారులకు దిశా నిర్దేశం చేసారు.


రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలలో ఎన్ని రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, కాంటిజెన్సీ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఎంత మంది అధికారులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇంకా ఎంత మందిని భర్తీ చేయాలనే మొదలగు అంశాలను కులంకుశంగా అయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆదేశాలనుసారంగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను రేపటిలోగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్ధిక శాఖకు సమర్పించాలని ఆయన సూచించారు. పరిపాలన సంస్కరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన జిల్లాలలో, మండలాలలో కావాల్సిన మేర సిబ్బంది పని చేస్తున్నారా? ఇంకా ఎంత సిబ్బంది అవసరం మొదలగు అంశాలను సమర్పించాలని అయన కోరారు.

- Advertisement -

సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి ఉప కార్యదర్శి ఆయేషా, పంచాయితీరాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సంజీవరావు, మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ చక్రవర్తి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ డిప్యూటి కమిషనర్ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌, సీపీఐల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరికలు

గ‌న్‌తో కాల్చుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న పోర్న్‌ స్టార్

యాదాద్రిలో వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు

రైతు సంఘాలతో పోలీసుల చర్చలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రేపటిలోగా ఖాళీ పోస్టుల వివరాలను అందించాలి : మంత్రి ఎర్రబెల్లి
రేపటిలోగా ఖాళీ పోస్టుల వివరాలను అందించాలి : మంత్రి ఎర్రబెల్లి
రేపటిలోగా ఖాళీ పోస్టుల వివరాలను అందించాలి : మంత్రి ఎర్రబెల్లి

ట్రెండింగ్‌

Advertisement