హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): మీడియా కార్డుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామంటూ ప్రభుత్వం సవరణ జీవో 103ను జారీ చేయడంపై రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్టీ) ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం సెక్రటేరియట్లో మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు.
అనంతరం డీజేఎఫ్టీ ప్రతినిధులు మాట్లాడుతూ.. జిల్లాల్లో పనిచేస్తున్న డెస్క్ జర్నలిస్టులందరికీ ఆయా ఎడిషన్ సెంటర్లలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, జిల్లా అక్రెడిటేషన్ కమిటీల్లోనూ డెస్క్ జర్నలిస్టులకు స్థానం కల్పించాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని మంత్రి పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో డీజేఎఫ్టీ నేతలు ఉపేందర్, మస్తాన్, రా జారాం, విజయ, రమేశ్ కనపర్తి, గుజ్జుల సత్యప్ర సాద్, రామగిరి కిరణ్, వీవీ రమణ, గరిమా, నరేశ్, విజయభాస్కర్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
ఐఅండ్‌పీఆర్ కమిషనర్‌కు టీయూడబ్ల్యూజే నేతల వినతి కేబుల్ చానళ్లు, చిన్న పత్రికలకు అక్రెడిటేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం కొత్త
జీవోను సవరించాలని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు నేతలు ఐఅండ్‌పీఆర్ కమిషనర్ ప్రియాంకకు మంగళవారం వినతిపత్రం అందజేశారు.