తెలంగాణ గ్రౌండ్ వాటర్ అట్లాస్
రాష్ట్రంలో ఏ ప్రాంతంలో, ఏ కాలంలో ఏవిధంగా భూగర్భజలాలు ఉంటున్నాయి? ఎంత మేరకు వినియోగించుకుంటున్నారు?
- రాష్ట్ర భూగర్భజలాల సమగ్ర సమాచారంతో రూపకల్పన
- నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఆవిష్కరణ
హైదరాబాద్, జనవరి20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏ ప్రాంతంలో, ఏ కాలంలో ఏవిధంగా భూగర్భజలాలు ఉంటున్నాయి? ఎంత మేరకు వినియోగించుకుంటున్నారు? వాటి నాణ్యత ఎలా ఉంది? తదితర వివరాల సమగ్ర సమాచారంతో రాష్ట్ర భూగర్భ జలశాఖ ‘తెలంగాణ గ్రౌండ్ వాటర్ అట్లాస్’, ‘దశాబ్దపు భూగర్భ జల నాణ్యత (2011-20)’ మ్యాప్‌లను రూపొందించింది. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ బిల్డింగ్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయా మ్యాప్‌లను రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్, భూగర్భజలశాఖ విభాగం డైరెక్టర్ పండిత్ మద్నూరే ఆవిష్కరించారు.
నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ (ఎన్హెచ్పీ) కింద 38 థీమాటిక్ మ్యాప్‌లతో గ్రౌండ్‌వాటర్ అట్లాస్‌ను భూగర్భ జలశాఖ తొలిసారిగా రూపొందించడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరం, మిషన్ కాకతీయ, ఇతర పథకాలతో సగటు భూగర్భజల మట్టాలు 4.26 కంటే ఎకువ పెరగడానికి దారితీశాయని అధికారులు తెలిపారు. అట్లాస్‌ను రూపొందించిన భూగర్భ జలశాఖ డైరెక్టర్ పండిత్ మద్నూరేతోపాటు ఇతర అధికారులను రజత్‌కుమార్ అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

