హైదరాబాద్ : మాకు రాజీవ్ గాంధీ పట్ల మాకు గౌరవం ఉంది. దేశం కోసం అయినా చేసిన సేవలు పట్ల సదాభిప్రాయం ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్(Deshpathi Srinivas) అన్నారు. సచివాలయం ప్రాంగణం(Secretariat premises)లో రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆయన స్పందించారు. ఈ మేరక శాసనమండలిలో ఆయన మాట్లాడారు.
జాతీయ నాయకుల పేర్లు అనేక వాటికి పెట్టుకున్నాం. ఇప్పటికే రాజీవ్ గాంధీ పేరు ఎయిర్పోర్ట్కి పెట్టుకున్నాం. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన చోట ఈ విగ్రహం పెట్టడం సరైంది కాదన్నారు. కానీ, తెలంగాణ తల్లి(Telangana thalli) తెలంగాణకు అత్యంత ముఖ్యం. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు.