హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) రద్దు చేసింది. 2023-24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ శివారులోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘన్పూర్లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట సుజనా చౌదరి ఈ కాలేజీని 2002లో స్థాపించారు.