కొత్తగూడెం ప్రగతి మైదాన్, మే 7 : మావోయిస్టులు ఓ గ్రామ ఉప సర్పంచ్‌ను హత్య చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లా జగర్గూండ పోలీస్‌స్టేషన్ పరిధి తార్లగూడ ఆధారిత బెన్పల్లి ఉప సర్పంచ్ ముచకి రామ మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నాడు.
గ్రామీణ దుస్తుల్లో వచ్చిన ఐదుగురు మావోయిస్టులు అతడిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి ప్రజలు చూస్తుండగానే గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. జగర్గూండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రామ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.