హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నారాయణగూడ సర్కిల్‌కు చెందిన డిప్యూటీ వాణిజ్య పన్నుల అధికారి (సీటీవో) బీ వసంతను లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధకారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి ఖాతాలో ఆర్థిక అవకతవకలను ఉపేక్షించేందుకు ఆమె రూ.35వేలు లంచంగా డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని ఆమె సదరు వ్యక్తి నుంచి స్వీకరిస్తుండగా పట్టుకున్నట్టు తెలంగాణ ఏసీబీ అధికారులు శుక్రవారం వెల్లడించారు.