హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఒడిశా రాష్ట్రం నైనీలో ఏర్పాటు చేయతలపెట్టిన థర్మల్ప్లాంట్పై స్పష్టతకొరవడింది. ఈ ప్లాంట్ ఏర్పాటు పై ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. ఒడిశాతో ఎంవోయూ చేసుకుంటామని సింగరేణి సంస్థ ప్రకటించగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ప్లాంట్ ఏర్పాటుపై ఆలోచన చేస్తామని శుక్రవారం ప్రకటించారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీతో భట్టి విక్రమా ర్క శుక్రవారం హైదరాబాద్‌లో భేటీ అ య్యారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ నైనీ కోల్‌బ్లాక్ వద్ద థర్మల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంధనశాఖ అధికారుల బృందం నైనీలో పర్యటించి, అంచనాలు రూపొందిస్తున్నదని తెలిపారు.
ఎంవోయూ చేసుకుంటాం: సింగరేణి
నైనీ కోల్బ్లాక్కు అనుబంధంగా 2,400 మెగావాట్ల థర్మల్ప్లాంట్లను నెలకొల్పుతామని సింగరేణి సంస్థ ఈ వారంలో ప్రకటించింది. 800 మెగావాట్ల సామర్థ్యం గల మూడు థర్మల్ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని మంగళవారం అధికారికంగా వెల్లడించింది. ఇందుకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిశా లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకోనున్నట్టు సింగరేణి ప్రకటించింది.