హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): సంతోషం లేని జీవితం.. ఎన్ని సంపదలున్నా దండుగేనని, అది పరిపూర్ణ జీవితం కాబోదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అభిప్రాయపడ్డారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు టీ వేణుగోపాల్‌రెడ్డి, ప్రముఖ రచయిత, జర్నలిస్టు విజయారె కలిసి రాసిన వ్యక్తిత్వ వికాస రచన ‘హ్యాపీ లైఫ్’ పుస్తకాన్ని ప్రజాభవన్‌లో ఆదివారం ఆయన ఆవిషరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజానికి ఇలాంటి పుస్తకాల అవసరం ఉన్నదని, జీవితంలో సంతోషాన్ని కోరుకునే ప్రతి ఒకరికీ ఇది ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచయితలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పాల్గొన్నారు.
భట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మంత్రులు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు ఉత్తమ్, తుమ్మల, సీతక, సినీనటుడు మురళీమోహన్ తదితరులు ప్రజాభవన్‌కు చేరుకుని ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.