హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): అమెరికాతో తెలుగు ప్రజలకు అవినాభావ సంబంధం ఉన్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార తెలిపారు. యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన అమెరికా 248వ స్వాతంత్య్ర వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాతో హైదరాబాద్ బంధం బలమైందని, రాబోయే రోజుల్లో ఇది మరింత పటిష్టమవుతుందని చెప్పారు. తెలుగు విద్యార్థులు ఉన్నత చదువులకు కోసం, ఉన్నతమైన జీవితం కోసం పెద్ద సంఖ్యలో అమెరికా వెళ్తుంటారని చెప్పారు. అమెరికాలో ప్రస్తుతం తెలుగు భాష అతివేగంగా విస్తరిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, యూఎస్ ఎంబర్సీరేర్ అడ్మిరల్ తదితరులు పాల్గొన్నారు.