హైదరాబాద్, జనవరి11 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఇకపై కామన్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. పోస్టర్ను ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార శనివారం ఆవిషరించారు. ఫిబ్రవరి 23న రాతపరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఆయా సొసైటీల కార్యదర్శులు అలగు వర్షిణి, సైదులు, సీతాలక్ష్మి పాల్గొన్నారు.