హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తె లంగాణ): రాష్ట్రంలో ఆర్టీసీ బస్సలను ఎ లక్ట్రికల్ బస్సులుగా రూపుదిద్దుతామని, ఇందుకు తోషిబా సంస్థ సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. జపాన్ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ఇతర ప్రతినిధి బృం దం ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థ తోషిబా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది.
ఫ్యూచర్ సిటీలో ఫ్యూయల్సెల్ టెక్నాలజీ యూనిట్ ఏర్పాటుకు ముందుకురావాలని తోషిబా ప్రతినిధులను భట్టి కోరారు. లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తోషిబా సింగరేణి సంస్థతో కలిసి ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణలో తోషిబాను మరింత విస్తరిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.