హైదరాబాద్, మే6 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీలో అమాత్యుడి ఆదేశాలకు విలువ లేకుండాపోయింది. డిప్యూటేషన్లు రద్దుపై ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించినా సొసైటీలోని పలువురు అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
ఎస్సీ గురుకుల సొసైటీలోని ప్రధాన కార్యాలయంలో పలువురు అధికారులు డిప్యూటేషన్‌పైనే కొనసాగుతున్నారు. దీంతో మంత్రి అడ్లూరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటేషన్లను రద్దు చేస్తున్నామని, మే 16వ తేదీనాటికి సదరు అధికారులందరినీ వారివారి పోస్టింగ్ ప్లేస్‌లకు పంపించేస్తామని ప్రకటించారు. కానీ డిప్యూటేషన్లు యథాతథంగా ఉంచేందుకు పలువురు ఉన్నతాధికారులు పావులు కదపడం చర్చనీయాంశంగా మారింది.
సంక్షేమ శాఖల పరిధిలో వివాదాలకు తావులేకుండా బదిలీలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దూరప్రాంతాల్లో దీర్ఘకాలంగా సేవలందించిన ఉద్యోగులను వారు కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిషారానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. గురుకులాల్లో 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని, జీవో 190 అమలు సాధ్యాసాధ్యాలను స మగ్రంగా పరిశీలించి అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. స మావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సంతోష్, ఎస్సీ అభివృద్ధి శాఖ ఇన్చార్జీ సెక్రటరీ శ్రీధర్, దివ్యాంగులశాఖ డైరెక్టర్ శై లజా, సొసైటీల కార్యదర్శులు శారద తదితరులు పాల్గొన్నారు.