హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాను తీరం వైపు దూసుకొస్తున్నది. గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనా డు ప్రభుత్వాలను ఐఎండీ అప్రమ త్తం చేసింది. దానా ప్రభావంతో రా ష్ట్రంలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశమున్న ట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆదివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ , మేడ్చ ల్ మలాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉండటంతో ఎల్లో అలెర్ట్‌ను జారీచేసింది.