కురవి, డిసెంబర్ 23 : మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు సక్రాంనాయక్ తండా డీఎన్టీ ప్రాథమిక పాఠశాలలో డీఎస్ శ్రీనివాస్ ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉపాధ్యాయుడు తనకు సెల్ఫోన్లో అసభ్యకర వీడియోలు చూపుతూ వికృతంగా ప్రవర్తిస్తున్నట్టు నాలుగో తరగతి బాలిక తల్లిదండ్రులకు తెలిపింది.
పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఎంఈవో లచ్చిరాంనాయక్ ఆదేశాల మేరకు కాంపల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎం అరుణశ్రీ సక్రాంనాయక్ విచారణ చేపట్టారు. వివరాలను డీఈవో రవీందర్‌రెడ్డికి తెలుపగా కీచక ఉపాధ్యాయుడిని డీఈవో సస్పెండ్ చేశారు.