నిమ్స్‌లో ఇక దంత వైద్యం
మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానగా ప్రత్యేక గుర్తింపు పొందిన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో శుక్రవారం నుంచి దంత వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.
- నేటి నుంచి అందుబాటులోకి సేవలు
హైదరాబాద్ సిటీబూరో/ఖైరతాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానగా ప్రత్యేక గుర్తింపు పొందిన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో శుక్రవారం నుంచి దంత వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. నూతనంగా ఏర్పాటుచేసిన దంత వైద్య విభాగాన్ని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గురువారం ప్రారంభించారు.
ఈ విభాగం ద్వారా కన్సల్టేషన్‌తోపాటు దంతాలను శుభ్రం చేయడం, పుచ్చు పళ్లను తొలగించడం, రూట్‌కెనాల్, క్యాపింగ్ తదితర సేవలను అందించనున్నట్టు అధికారులు తెలిపారు. దీనిని స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్‌నంబర్ 11లో ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు.
ఈ డెంటల్ క్లినిక్ ఓపీ సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ లక్ష్మీభాస్కర్, డాక్టర్ కృష్ణారెడ్డి, అసోసియేట్ డీన్ డాక్టర్ సాయిసతీశ్, డాక్టర్ సాయిబాబా, దంత వైద్యులు డాక్టర్ మహ్మద్ ఖ్వాజా మొయినుద్దీన్, ఏపీఆర్వో ఆశారాణి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

