బొల్లారం, డిసెంబర్ 11: కంటోన్మెంట్ ఏడో వార్డు పరిధిలోని లాల్ బజార్ నుంచి తిరుమలగిరి చౌరస్తా వరకు ఫుట్‌పాత్‌పై అక్రమ నిర్మాణాలను బుధవారం కూల్చివేశారు. ట్రాఫిక్ డీసీసీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ఫుట్‌పాత్ ఆక్రమణల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.
‘భారత్ గౌరవ్’ రైలు ప్రారంభం
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): అయోధ్య-కాశీ భారత్ గౌరవ యాత్ర రైలు బుధవారం సికింద్రాబాద్‌లో ప్రారంభించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 20 వరకు యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. అలాగే శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు 14 నుంచి జనవరి 18 వరకు నడుస్తాయని తెలిపారు.
1.10 కోట్లు కాపాడారు
హైదరాబాద్, డిసెంబర్ 11 : ఓ సైబర్ నేరగాడు ఒక అమాయకుడిని మోసం చేసి రూ.1.90 కోట్లు కొట్టేసేందుకు ప్రయత్నించగా సైబర్ క్రైమ్ పోలీసులు రూ.1.10 కోట్లను రికవరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 10న సాయంత్రం 4 గంటలకు సైబర్ క్రైం టోల్‌ఫ్రీ నంబర్ 1903కి ఒక వ్యక్తి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.1.90 కోట్లు బదిలీ అయ్యాయని ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ మౌనిక స్పందించి బ్యాంకింగ్ ఫాలోఅప్ బృందాన్ని అప్రమత్తం చేశారు. ఎస్ఐ శిరీష, కానిస్టేబుళ్లు స్వప్న, వెంకటేశ్ నేతృత్వంలోని బృందం బ్యాంక్‌ను సంప్రదించి వివరాలు సేకరించారు. బీవోబీ, ఇండియన్ తదితర బ్యాంకులను సంప్రదించి లావాదేవీలను నిలుపుదల చేశారు.