హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : దేశంలో మహిళల రాజకీయ భాగస్వామ్యం పెరిగితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు పేరొన్నారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో బుధవారం భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని ఆరోపించారు. మహిళలపై హింసపై ఉద్యమించాలని డాక్టర్ రజిని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సీనియర్ నాయకురాలు పద్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి, వరింగ్ ప్రెసిడెంట్ సదాలక్ష్మి, ఉపాధ్యక్షురాలు ఛాయాదేవి, సహాయ కార్యదర్శి నళినీరెడ్డి పాల్గొన్నారు.