హైదరాబాద్, జూలై 7 (నమస్తేతెలంగాణ): జనాభా దామాషా ప్రకారం తమకు రిజర్వేషన్ కల్పించాలని ముదిరాజ్ పోరాట సమితి డిమాండ్ చేసింది. ‘మేమెంతో.. మాకంత’ ఉండాలని, ఉద్యోగ, రాజకీయాల్లో తమ వాటా తమకు అందాలని కోరింది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో ముదిరాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం పీసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు వినతిపత్రం ఇవ్వాలని భావించగా ఆమె అందుబాటులో లేరు. దీంతో గాంధీభవన్ ఇన్చార్జికి వినతిపత్రం అందజేశా రు. అనంతరం మాట్లాడుతూ బీసీ ‘డీ’ జాబితాలో ఉన్న ముదిరాజ్ కులాన్ని బీసీ‘ఏ’లోకి మార్చాలన్నారు. ఆ తర్వా తే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అత్యధిక జనాభా కల్గిన ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
మంచి సమాజం కోసం ‘ముందడుగు’ వేయాలి ; చంచల్‌గూడ జైలు ఎస్పీ శివకుమార్‌గౌడ్
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): మంచి సమాజం కోసం ప్రతి ఒకరూ ముందడుగు వేయాలని చంచల్‌గూడ జైలు ఎస్పీ శివకుమార్‌గౌడ్ కోరారు. సోమవారం జైలు కార్యాలయంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బృందంతో కలిసి ‘ముందడుగు’ లోగోను ఆవిషరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో యువత చెడు మార్గాలకు వెళ్లకుండా, మంచి మార్గాలవైపు పయనించేలా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ముందడుగు విభాగాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామమని తెలిపారు. గ్రామస్థాయిలో యువతకు సమాజం, హకులపై అవగాహన కల్పిస్తూ.. వారి సమస్యలు వారే పరిషరించుకునేలా మనవంతు కృషిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ‘ముందడుగు’ టీషర్ట్స్‌ను ఆవిషరించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి, మహిళా చైర్మన్ డాక్టర్ స్రవంతి, మహిళా అధ్యక్షురాలు గీతానంద్, జాతీయ కార్యవర్గ సభ్యుడు కే రమేశ్‌బాబు, జీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.