హైదరాబాద్, మే 21(నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం విధానం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా ఐదుగురు నిందితులపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే అంశంపై న్యాయస్థానం ఈ నెల 29న తీర్పు వెలువరించనున్నది. ఈడీ వేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా.? లేదా అన్నదానిపై రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకోనున్నది. ఈనెల 28న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌పై వాదనలు జరుగనున్నాయి.