బీసీ గురుకులంలో విద్యార్థి మృతి
అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన రాచర్ల దేవేందర్- భవాని దంపతుల పెద్ద కుమారుడు రాచర్ల కార్తీక్ (19) నాంచారిమడూరు శివారులోని మహాత్మా జ్యోతిరావుఫూలే డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
- డిగ్రీ కాలేజీ డార్మిటరీలో ఉరేసుకొని కనిపించిన కార్తీక్
తొర్రూరు, ఏప్రిల్ 26 : అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన రాచర్ల దేవేందర్- భవాని దంపతుల పెద్ద కుమారుడు రాచర్ల కార్తీక్ (19) నాంచారిమడూరు శివారులోని మహాత్మా జ్యోతిరావుఫూలే డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కళాశాల డార్మిటరీలో ఎవరూలేని సమయంలో బెడ్‌కు అమర్చిన ఇనుప కడ్డీలకు బెల్ట్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు వెంటనే కార్తీక్‌ను తొర్రూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా, అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వర్ధన్నపేట ఏరియా దవాఖానకు తరలించారు. తమ కుమారుడు కార్తీక్ ఆత్మహత్య చేసుకోలేదని, కళాశాలలో ఏదో గొడవ జరిగిన క్రమంలో హత్యచేసి ఉంటారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. ఇది పూర్తిగా కళాశాలలో యాజమాన్యం తప్పిదమేనని, సీసీ కెమెరాల పుటేజీలను చూపించాలని డిమాండ్‌చేశారు. కార్తీక్ గతంలో ఎంసెట్ రాసి సీటు రాకపోవడంతో మళ్లీ ఈ సంవత్సరం పరీక్ష రాయాలని తండ్రితో ఫోన్లో మాట్లాడిన అనంతరం ఈ దారుణానికి పాల్పడినట్టు తోటి విద్యార్థులు వెల్లడించారు. రాచర్ల దేవేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

