మెదక్: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయి. ప్రతి రోజు మహిళలు, బాలికపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్లో (Medak) యువతిపై ప్రేమోన్మాది దాడికి తెగబడ్డాడు. తనను ప్రేమించడం లేదని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు దవాఖానకు తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం పోలీసులు యువతిని హైదరాబాద్ తరలించారు.
ఆమె ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు వచ్చినట్లు గుర్తించారు. దాడి చేసిన యువకుడు కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన చేతన్ అలియాస్ కిరణ్ అని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.