హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరితే ఇక నుంచి కచ్చితంగా తరగతులకు హాజరుకావాల్సిందే. 90 రోజుల కాలవ్యవధి సెమిస్టర్‌లోని అన్ని క్లాస్‌లకు హాజరైతే 10 మార్కులిస్తారు. అంతకన్నా తక్కువ క్లాసులకు హాజరైతే 9, 8 ఇలా విద్యార్థి వచ్చిన రోజులను బట్టి మార్కులేస్తారు. ఇప్పటివరకు పరీక్షలకు మార్కులేయగా తాజాగా హాజరుకు కూడా మార్కులు కేటాయిస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకొన్నది.ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సిఫారసులను పరిగణనలోకి తీసుకొని అటెండెన్స్‌కు 10 మార్కులు కేటాయిచింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యలో నిరంతరం సమగ్ర మూల్యాంకనాన్ని అమలుచేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇటీవలే ఉన్నత విద్యామండలి పరీక్షల విధానంలో సంస్కరణలపై రోడ్‌మ్యాప్ ఖరారు చేసింది. దీని అమలుకు రాష్ట్రంలోని సంప్రదాయ వర్సిటీలకు లేఖ రాసింది. తాము సూచించిన విధానంతోపాటు సొంతంగా సంస్కరణలను అమలుచేసుకొనే స్వేచ్ఛను వర్సిటీలకు ఇచ్చింది.
మార్గదర్శకాలిలా..