హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రక్షణ రంగానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీహబ్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిఫెన్స్ ఇండియా స్టార్టప్ చాలెంజ్ పేరుతో ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
దీనికి ఈ నెల 18 వరకు అవకాశం ఉందని టీహబ్ నిర్వాహకులు తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ, డిపార్టుమెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ గర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో దేశవ్యాప్తంగా స్టార్టప్‌ల నిర్వాహకులు భాగస్వాములు కావచ్చని పేర్కొన్నారు. రక్షణ శాఖకు అవసరమైన అధునాతన డిటెక్టర్లు, ఇమేజింగ్ సెన్సర్లు, ఏఐ, డేటా ఎనలిటిక్స్ వంటి టెక్నాలజీలతో స్టార్టప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి ఇది మంచి అవకాశమని చెప్పారు. వివరాలకు https://bit.ly/3Re1l5Vలింక్‌ను సందర్శించాలని సూచించారు.