కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని న్యూ మహారాజా లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న తల్లి పద్మ, కుమారుడు సంతోష్ ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. కామారెడ్డి కోర్టు ఆరుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది.
నిందితులు పల్లె జితేందర్ గౌడ్ మెదక్ జిల్లాలోని రామాయంపేట్ మున్సిపల్ చైర్మన్, సరాఫ్ యాదగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, ఐరేని పృథ్వీ గౌడ్, తోట కిరణ్, కన్నపురం కృష్ణ గౌడ్, సరాప్ స్వరాజ్ లను న్యాయమూర్తి ఆదేశాలతో నిజామాబాద్ జైలుకు తరలించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రస్తుత తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్ పైన విచారణ కొనసాగుతోందని కామారెడ్డి పోలీసులు వెల్లడించారు. సీఐని అరెస్ట్ చేయకపోవడంపై మీడియా ప్రశ్నించగా సాక్ష్యాధారాలు సేకరిస్తున్నట్లుగా వెల్లడించారు.