నాంపల్లి కోర్టులు, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులకు మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అధికారి ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు భుజంగరా వు, తిరుపతన్న దాఖలు చేసిన పిటిషన్లను నాంపల్లి కోర్టు డిస్మిస్ చేసింది.
12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య శుక్రవారం తీర్పు వెల్లడించారు. డిఫా ల్ట్ బెయిల్ పిటిషన్లను ఒకసారి తిరస్కరించి న తర్వాత మరోసారి వాటిని దాఖలు చేసేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిందని గుర్తుచేస్తూ.. ఈ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయరాదని స్పష్టం చేశారు. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు ఆమోదించి, పీఆర్సీ నంబర్ (260 ఆఫ్ 2024)ను కేటాయించింది.