కేసీఆర్ పాలనలో తెలంగాణ అగ్రగామి : కేసీఆర్ పదేండ్ల పాలనలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం దీక్షా దివస్ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర, కందాల, చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో దీక్షా దివస్‌లో పాల్గొన్న శాసనమండలిలో బీఆర్ఎస్ నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్
కేసీఆర్ లేకుంటే తెలంగాణ పదమే మాయమయ్యేది: కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం కాదు కదా, ఆ పదమే వినిపించకుండా పోయేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రమావత్, రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్ ఉద్యమ ఫలితమే బంగారు తెలంగాణ: కేసీఆర్ ఉద్యమ ఫలితమే నేటి బంగారు తెలంగాణ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ఉర్సులో నిర్వహించిన దీక్షా దివస్‌లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రాష్ర్టాన్ని పాలించే సత్తా రేవంత్‌కు లేదు: రాష్ర్టాన్ని పాలించే సత్తా రేవంత్‌రెడ్డికి, మంత్రులకు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్షా దివస్‌లో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జనం కేసీఆర్‌ను కోరుకుంటున్నరు: ఏడాది కాలంలో ఏం కోల్పోయామో ప్రజలకు తెలిసొచ్చిందని, కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ను లేకుండా చేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన దీక్షా దివస్‌లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, దీక్షా దివస్ ఇన్చార్జి ఫారూఖ్ హుస్సేన్ పాల్గొన్నారు.
కేసీఆర్ దీక్షతోనే కేంద్రం దిగొచ్చింది: కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతోనే కేంద్రం దిగొచ్చి తెలంగాణ ప్రకటించిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం దీక్షా దివస్‌లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్పేరు చెరపడం రేవంత్ తరం కాదు: తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ప్రజల గుండెల్లో నిలిచిన కేసీఆర్ పేరును చెరిపేయడం రేవంత్‌రెడ్డి తరం కాదని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని దీక్షా దివస్‌కు మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధుకర్, దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.
దీక్షా దివస్ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ దవాఖాన నుంచి తెలంగాణ భవన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చారు. మధ్యాహ్నం నుంచే షురూ అయిరాత్రి వరకూ సందడి నెలకొన్నది. గులాబీ జెండాల రెపరెపలతో ఆ రోడ్డంతా గులాబీ మయమైంది. జై తెలంగాణ నినాదం దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగింది. కళాప్రదర్శనలు అలరించాయి. నేతల ప్రసంగాలు ఆలోచన రేకెత్తించాయి. మరో పోరుకు సిద్ధమవుదామని శ్రేణులు ప్రతినబూనాయి.
జై తెలంగాణ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన రణన్నినాదం మార్మోగింది. దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బసవతారకం క్యాన్సర్ దవాఖాన నుంచి గిరిజన మహిళలతో కలిసి ర్యాలీగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఆడిపాడుతూ సందడి చేశారు.
భువనగిరిలోని ప్రిన్స్ కార్నర్ చౌరస్తాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన దీక్షా దివస్‌లో పాల్గొన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు
నల్లగొండ జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నేతల ఉపన్యాసాలకు అడుగడుగునా పోరు పిడికిలి ఎత్తుతూ మద్దతు తెలిపారు. పలుమార్లు పిడికిళ్లు ఎత్తి జై తెలంగాణ అంటూ వారు చేసిన నినాదాలు నింగినంటేలా మార్మోగాయి.
కామారెడ్డి జిల్లాకేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న బీఆర్ఎస్ నేత, దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జడ్పీ మాజీ చైర్పర్సన్లు దఫేదార్ రాజు, శోభ, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తదితరులు
మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి రణన్నినాదం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిపై మండిపడ్డారు. పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, చంద్రాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో జరిగిన దీక్షా దివస్‌లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఉద్యమపథాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ సూర్యచంద్రులని పేర్కొన్నారు. ఉద్యమ చరిత్రను నాటి దీక్షతో మలుపు తిప్పిన ఘనత కేసీఆర్‌దని, పోరాట, పరిపాలన పటిమ బీఆర్ఎస్ పార్టీ సొంతమని చెప్పారు. బ్యాగ్బాబ్జీకి ప్రజల బాగోగులు ఏమి తెలుసని ఎద్దేవా చేశారు. సమావేశంలో తోట ఆగయ్య, జిందం చక్రపాణి, చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడారు. ఉద్యమ నేత కేసీఆర్ చరిత్ర చెరపలేనిదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వనమా వెంకటేశ్వరరావు, బానోతు హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, దిండిగల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ తల్లిపై ఒట్టేసి చెప్తున్నం.. కేసీఆర్ ఆమరణ దీక్ష స్ఫూర్తితో ఇప్పటి మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతామని నేతలు ప్రతినబూనారు. సంగారెడ్డి జిల్లా కందిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా పరిశీలకుడు దేవీ ప్రసాద్, చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ఎవడో వచ్చి పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదు. వటవృక్షం’ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను ఏదో చేస్తామని శపథాలు చేసిన వైఎస్, చంద్రబాబు, కిరణ్‌కుమార్ జెండాలు పీక్కొని పోయారని తెలిపారు.
దీక్షా దివస్ సందర్భంగా శుక్రవారం బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేస్తున్న దీక్షా దివస్ ఇన్చార్జి, ఎమ్మెల్సీ వాణీదేవి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్ తదితరులు
కరీంనగర్‌లోని అల్గునూర్ చౌరస్తాలో నిర్వహించిన దీక్షా దివస్ సభా వేదికపై పాట పాడి కార్యకర్తలను రంజింపజేస్తున్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి తుల ఉమ
దీక్షా దివస్ సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పండ్లు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బీఆర్ఎస్ నేతలను తదితరులను అడ్డుకుంటున్న ఏసీపీ ప్రకాశ్
కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లోనే రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించిందని, మళ్లీ బీఆర్ఎస్దే అధికారమని మాజీఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో దీక్షా దివస్‌లో వారు మాట్లాడారు.
నాడు కేసీఆర్ చేపట్టిన దీక్ష ఫలితంగానే నేడు కాంగ్రెస్ నేతలు పదవులు అనుభవిస్తున్నారని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన దీక్షా దివస్‌లో కేసీఆర్ చిత్రపటానికి, అమరవీరుల స్థూపానికి క్షీరాభిషేకం చేశారు. ప్రతి కార్యకర్త కేసీఆర్ సైనికుడిగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.