నిర్మల్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, దీక్షా దివస్ నిర్మల్ జిల్లా ఇన్చార్జి శేరి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ శివారులోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 29న నిర్మల్‌లో నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని కోరారు.