హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్ ఫలితాలు జూన్ 5న విడుదలకానున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే జూన్ 5 లోపు ఎప్పుడైనా ఫలితాలు విడుదల చేయనున్నారు.
డీఈఈ సెట్ పరీక్షను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఆన్లైన్లో నిర్వహించిన పరీక్షకు 77.54% మంది విద్యార్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. 43,615 మంది దరఖాస్తు చేయగా 33,821 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.