హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సులో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే డీఈఈసెట్ పరీక్షను ఈనెల 21న నిర్వహించనున్నట్లు కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో 16 జిల్లాల్లో 60 సెంటర్లల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈనెల 15న హాల్ టికెట్లను విడుదల చేస్తామని తెలిపారు. ఈ ఏడాది 32,611 విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు.